• Login / Register
  • ఎడ్యుకేష‌న్

    EapCet-2025 |ఎప్‌సెట్‌కు ప్రొఫెస‌ర్ డీన్ కుమార్‌

    EapCet-2025 |ఎప్‌సెట్‌కు ప్రొఫెస‌ర్ డీన్ కుమార్‌
    ప్ర‌వేశ ప‌రీక్ష‌ల క‌న్వీన‌ర్లు ఖ‌రారు
    ఆదేశాలు జారీ చేసిన ఉన్న‌త విద్యా మండ‌లి
    Hyderabad : రాష్ట్రంలోని బీటెక్‌, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వ్రుత్తి విద్యా కోర్సుల్లో.. 2025 -26 విద్యాసంవత్స‌రానికి సంబంధించిన ప్రవేశాలకు క‌న్వీన‌ర్ల‌ను ప్ర‌క‌టించారు.  ఈమేర‌కు టీజీ ఎప్‌సెట్‌ కన్వీనర్‌గా జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్‌ బీ డీన్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను మరోసారి జేఎన్టీయూకే అప్పగించగా, కన్వీనర్‌గా డీన్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న జేఎన్టీయూ సివిల్‌ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌లో హెడ్‌గా పనిచేస్తున్నారు. 
    అలాగే ఎప్‌సెట్‌తో పాటు మరో 6 ప్రవేశ పరీక్షల కన్వీనర్లను, ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీలను కూడా మంగళవారం రాష్ట్ర‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి  ప్రకటించారు. అలాగే పీజీఈసెట్‌ నిర్వహణ బాధ్యతలనూ జేఎన్టీయూకే అప్పగించగా, కన్వీనర్‌గా జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్‌ ఏ అరుణకుమారిని నియ‌మించారు. అలాగే ఐసెట్‌ను గతంలో కేయూ నిర్వహించగా, ఈ సారి మహత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించారు. 

    ఈ ఐసెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ అలువాల రవిని నియమించారు. ఎడ్‌సెట్‌ను గ‌తంలో మహాత్మాగాంధీ వర్సిటీ నిర్వహించగా, ఈ సారి కాకతీయ వర్సిటీకి అప్పగించారు. ప్రొఫెసర్‌ బీ వెంకట్రామ్‌రెడ్డిని ఈ ప్రవేశ పరీక్ష కన్వీనర్‌గా నియమించారు. ఈసెట్‌ గతంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించగా, ఈ సారి అదే వర్సిటీకి అప్పగించారు. ఈసెట్‌కు ప్రొఫెసర్‌ పీ చంద్రశేఖర్‌కు కన్వీనర్‌గా నియమించారు. లాసెట్‌ను కూడా గ‌తంలో ఓయూ నిర్వహించగా, ఈ సారి అదే వర్సిటీకి అప్పగించి కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ బీ విజయలక్ష్మీని నియమించారు. పీఈసెట్‌ను పోయిన ఏడాది శాతవాహన వర్సిటీకి నిర్వహించగా, ఈ సారి పాలమూరు వర్సిటీకి బాధ్యతలను అప్పగించి, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ ఎన్‌ఎస్ దిలీప్‌ను నియమించారు. 
    -------------------------------------------------------------------------------------------------------------------
    ప్రవేశ పరీక్ష        నిర్వ‌హ‌ణ వ‌ర్సిటీ పేరు                        సెట్‌ కన్వీనర్ పేరు
    ----------------------------------------------------------------- --------------------------------------------------
    ఎంసెట్‌                            జేఎన్టీయూహెచ్‌                ప్రొఫెసర్‌ బీ డీన్‌ కుమార్‌
    పీజీఈసెట్‌                       జేఎన్టీయూహెచ్‌                ప్రొఫెసర్‌ ఏ అరుణకుమారి
    ఐసెట్‌                              మహాత్మాగాంధీ                   ప్రొఫెసర్‌ అలువాల రవి
    ఈసెట్‌                             ఉస్మానియా                        ప్రొఫెసర్‌ పీ చంద్రశేఖర్‌ 
    లాసెట్‌, పీజీలాసెట్‌       ఉస్మానియా                         ప్రొఫెసర్‌ బీ విజయలక్ష్మీ
    ఎడ్‌సెట్‌                          కాకతీయ                              ప్రొఫెసర్‌ వెంకట్రామ్‌రెడ్డి
    పీఈసెట్‌                         పాలమూరు                          ప్రొఫెసర్‌  ఎన్‌ఎస్ దిలీప్‌
    ---------------------------------------------------------------------------------------------------------------------

    Leave A Comment